తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు - హిమాచల్​ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తాజా వార్తలు

తెలంగాణ ప్రజలకు హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలని ఆకాంక్షించారు.

himachalpradesh governer Bandaru Dattatreya wishes to the telangana people
రాష్ట్ర ప్రజలకు బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు

By

Published : Jun 2, 2020, 4:43 PM IST

హిమాచల్​ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 6 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ.. అన్ని రంగాల్లోనూ పురోగమించాలని ఆకాంక్షించారు. కొవిడ్‌-19 సృష్టించిన ఈ కల్లోల పరిస్థితిని తెలంగాణ ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా 59వ పుట్టినరోజు జరపుకుంటున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు దత్తాత్రేయ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా బారినపడిన మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డికి ఫోన్‌ చేసి పరామర్శించారు. తొందరగా కోలుకుని.. తిరిగి ప్రజాజీవితంలో మమేకం కావాలని ఆకాంక్షించారు.

ఇదీచూడండి: కాళేశ్వరం తెలంగాణకు మణిహారం: మంత్రి తలసాని

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details