భాగ్యనగరంలో భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ చరవాణిలో పరామర్శించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజల్లో ధైర్యం నింపారు. ఇళ్లలోకి వరదనీరు ప్రవహించి ఇబ్బందులు పడుతున్న ప్రజలతో నేరుగా మాట్లాడి, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.
వరద బాధితులను పరామర్శించిన బండారు దత్తాత్రేయ - presaent situation inn hyderabad with flood water
హైదరాబాద్ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. నగర ప్రజలతో చరవాణిలో నేరుగా మాట్లాడి వారిలో స్థైర్యం నింపారు. వరద వల్ల గగన్‌పహాడ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు.
వరద బాధితులను పరామర్శించిన బండారు దత్తాత్రేయ
భారీ వర్షాలతో మంగళహాట్ ప్రాంతంలో ఆరేళ్ల పాపని కోల్పోయిన మహమ్మద్ ఇమ్రాన్‌ను పరామర్శించారు. గగన్‌పహాడ్‌లో నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మునీర్ఖాన్తో చరవాణిలో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆపద సమయంలో కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు చేతులు సబ్బుతో కడుక్కోవాలని, మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. పలు కాలనీల్లో ప్రజలతో మాట్లాడి, వారి పరిస్థితిపై దత్తాత్రేయ అడిగి తెలుసుకున్నారు.