దేశంలోని యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పైన వివేకానంద విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. వివేకానందుడు సూచించిన మార్గంలో పయనించాలన్నారు. దేశభక్తి కలిగి ఉండడమే కాకుండా... సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకోవాలని చెప్పారు. అప్పుడే దేశంలో నిరుద్యోగ కష్టాలు సమసిపోతాయని దత్తాత్రేయ తెలిపారు.
'యువత వివేకానందుని బాటలో పయనించాలి' - స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో బండారు దత్తాత్రేయ
యువత నైపుణ్య శక్తిని పెంపొందించుకుండే నిరుద్యోగ సమస్య తొలగిపోతుందని హిమాచ్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్దనున్న వివేకానంద విగ్రహం వద్ద ఆయన నివాళి అర్పించారు.

స్వామి వివేకానంద జయంతి