తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రి నుంచి దత్తాత్రేయ డిశ్చార్జ్​ - himachalpradesh governer decharge from hospital

సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన బండారు దత్తాత్రేయను వైద్యులు డిశ్చార్జ్​ చేశారు. ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉన్నట్టు వెల్లడించారు. ఆసుపత్రిలో దత్తాత్రేయను పలువురు నేతలు, కార్యకర్తలు పరామర్శించారు.

himachalpradesh governer bandaru dathathreya decharge from hospital
ఆసుపత్రి నుంచి దత్తాత్రేయ డిశ్చార్జ్​

By

Published : Mar 9, 2020, 4:29 PM IST

స్వల్ప అస్వస్థతో హైదారాబాద్​ హైదర్​గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరిన హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ డిశ్చార్జ్​ అయ్యారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.

సాధారణ వైద్యపరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. లక్ష్మణ్​తో పాటు తెదేపా నేత రావుల చంద్రశేఖర్​ రెడ్డి, పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు దత్తాత్రేయను పరామర్శించారు.

ఆసుపత్రి నుంచి దత్తాత్రేయ డిశ్చార్జ్​

ఇదీ చూడండి:అపోలో ఆస్పత్రిలో చేరిన దత్తాత్రేయ

ABOUT THE AUTHOR

...view details