తెలంగాణ

telangana

ETV Bharat / state

నారీశక్తి దేశానికే శక్తి: దత్తాత్రేయ - Himachal pradesh governor news

మహిళలు చట్టసభల్లో అడుగుపెడితే... దేశం రూపులేఖలే మారిపోతాయని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు జరిగాయి.

Himachal pradesh governor on srujana excellency awards
నారీశక్తి దేశానికే శక్తి: దత్తాత్రేయ

By

Published : Mar 15, 2020, 6:01 AM IST

మహిళలు అధిక సంఖ్యలో రాజకీయాల్లోకి వస్తే... సమాజంలో అద్భుతమైన మార్పు వస్తుందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. సృజన సాంస్కృతిక, సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో... హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు జరిగాయి. సృజన మహిళా జీవన సాఫల్యం... విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు.

నారీశక్తి దేశానికే శక్తి అని దత్తాత్రేయ అన్నారు. మహిళలు చట్టసభల్లో అడుగుపెడితే... దేశం రూపులేఖలే మారిపోతాయని పేర్కొన్నారు. వారి వారి జీవితాల్లో అనేక అటుపోట్లు, ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ... ఒకస్థాయికి ఎదిగిన మహిళామణుల్ని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. దేశాభివృద్ధిలో మహిళా పాత్ర కీలకమైందని... అందుకే ప్రధాని మోదీ మహిళలకు పెద్దపీఠ వేశారన్నారు. మహిళలు పురుషులకంటే తక్కువేమీ కాదు... అయినప్పటికీ సమాజంలో లింగవివక్షత కొనసాగుతుండటం అత్యంత బాధాకరమన్నారు.

నారీశక్తి దేశానికే శక్తి: దత్తాత్రేయ

ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్​: కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details