మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వని కుంట తండాకు చెందిన జవాన్ పరుశురాం(30) విధి నిర్వహణలో ఉన్న సమయంలో కొండా చరియలు విరిగిపడటంతో మృతి చెందాడు. జవాన్ మృతి పట్ల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. పరుశురాం సతీమణి శాంతిని ఫోన్లో పరామర్శించారు.
జవాన్ పరుశురాం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన దత్తాత్రేయ - హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ వార్తలు
జమ్ము కశ్మీర్లో లడఖ్-లేహ్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ పరుశురాం మృతిపై హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. పరశురాం సతీమణి శాంతిని ఫోన్లో పరామర్శించారు.
జవాన్ పరుశురాం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన దత్తాత్రేయ
పరశురాం ఆత్మకు శాంతిని చేకూరాలని.. ఈ కష్ట సమయాన వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని బండారు దత్తాత్రేయ చెప్పారు.
ఇదీ చదవండి:తాజా తాజా కూరగాయలు... ఇంటి వద్దే పండించి తినేయరూ...!