తెలంగాణ

telangana

ETV Bharat / state

యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి: దత్తాత్రేయ - హైదరాబాద్​ వార్తలు

యువత శారీరకంగా, మానసికంగా ఎదగడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయం వ్యక్తం చేశారు. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

himachal-pradesh-governor-dattatreya-at-bandaru-vyshnav-memorial-cricket-tournament
యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి: దత్తాత్రేయ

By

Published : Mar 4, 2021, 10:08 AM IST

దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దత్తాత్రేయ కుమారుడు బండారు వైష్ణవ్ స్మారకర్థం ఓయూ ఫుట్ బాల్ గ్రౌండ్​లో వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు వైష్ణవ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్​ను నిర్వహించారు.

బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్​కు దత్తాత్రేయ... భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్ రావుతో కలిసి హాజరయ్యారు. యువత శారీరకంగా, మానసికంగా ఎదగడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని దత్తాత్రేయ పేర్కొన్నారు. వీబీ ఫౌండేషన్ పేరు మీద మున్ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మ్యాచ్​లో మొదట విజేతగా నిలిచిన జట్టుకు రూ.50,000 నగదుతో పాటు షీల్డ్, రెండో బహుమతికి 20,000 నగదును, షీల్డ్​ను బహుకరించారు.

ఇదీ చూడండి:భారత్​ X ఇంగ్లాండ్​: నిర్ణయాత్మక పోరులో గెలుపెవరిది?

ABOUT THE AUTHOR

...view details