తెలంగాణ

telangana

ETV Bharat / state

మేధాశక్తిని పెంచుకునేందుకే నూతన విద్యా విధానం: దత్తాత్రేయ - తెలంగాణ తాజా వార్తలు

బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికి... విద్యార్థుల్లో మేధాశక్తిని పెంచేందుకు నూతన విద్యా విధానం దోహదపడుతుందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. జూమ్ ద్వారా నూతన విద్యా విధానం పాలసీపై నిర్వహించిన రౌండ్​టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

మేధాశక్తిని పెంచుకునేందుకే నూతన విద్యా విధానం: దత్తాత్రేయ
మేధాశక్తిని పెంచుకునేందుకే నూతన విద్యా విధానం: దత్తాత్రేయ

By

Published : Sep 20, 2020, 4:17 PM IST

నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్ర గవర్నర్​ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రాథమిక విద్య పూర్తయ్యే సమయానాకి ఏదో ఒక వృత్తి విద్యా కోర్సును అభ్యసించే విధంగా ప్రణాళిక చేశామన్నారు. జూమ్​యాప్​ ద్వారా నూతన విద్యా విధానంపై నిర్వహించిన రౌండ్​టేబుల్​ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాతృ భాషలో విద్యను అభ్యసించేలా ఈ నూతన విధానం రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు.

మాతృభాషలోనే విద్యా బోధన

చైనా, ప్రాన్స్, రష్యా, ఇటలీ, అరబ్ దేశాలతో పాటు సౌత్ కొరియాలోను మాతృ భాషలోనే విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. నూతన విద్యా విధానాన్ని విద్యార్థులు సరళంగా నేర్చుకునేలా... రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులు పరిశోధనలు, ఇన్నోవేషన్స్ చేసేందుకు నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు. వర్చువల్ ల్యాబ్​లను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. యూజీసీ, ఎఐసీటీ, జాతీయ ఉపాధ్యాయ మండలిని కలిపి వీలీనం చేస్తామన్నారు. వర్సిటీలు, కళాశాలల్లో మరింత నాణ్యత పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని దత్తాత్రేయ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మరో ఘనతను సాధించిన శంషాబాద్​ విమానాశ్రయం

ABOUT THE AUTHOR

...view details