సమాజంలో ఇల్లు, బడి, గుడికి అత్యంత ప్రాధాన్యం ఉందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కుటుంబ సంస్కారాన్ని ఇల్లు నేర్పేస్తే... బడి గురుతర బాధ్యతతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. గుడి ఆధ్యాత్మికతను, నైతిక విలువలను పెంపొందిస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని పంచముఖి దేవాలయాన్ని సందర్శించిన ఆయన... పాలక మండలికి ఐఎస్వో 2015 ధ్రువపత్రాన్ని అందజేశారు.
గుడి ఆధ్యాత్మికత, నైతిక విలువలను పెంపొందిస్తుంది: దత్తాత్రేయ - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని పంచముఖి దేవాలయాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఆలయ పాలక మండలికి ఐఎస్వో ధ్రువపత్రాన్ని అందజేశారు. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
గుడి ఆధ్యాత్మికత, నైతిక విలువలను పెంపొందిస్తుంది: దత్తాత్రేయ
మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఆలయాలను పరిరక్షించడంతో పాటు ధర్మ పరిరక్షణకు హైందవ జాతి కంకణ బద్ధులై ఉండాలని ఆయన అన్నారు.
ఇదీ చదవండి:పోడు భూముల వివాదం... అటవీ శాఖ, గిరిజనుల మధ్య ఘర్షణ