హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట హిజ్రాలు ధర్నా చేపట్టారు. డబ్బులు ఇవ్వాలంటూ మరో వర్గం హిజ్రాలు వేధిస్తున్నారని ఆరోపించారు. తమపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.
అనంతరం సైబరాబాద్ షీ టీం డీసీపీ అనసూయతో చర్చలు జరిపారు. తమకు న్యాయం జరగడం లేదని కొందరు హిజ్రాలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కమిషనరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని నిలువరించేందుకు యత్నించారు. మహిళా పోలీసుల సాయంతో వారిని అడ్డుకున్నారు. తమకు న్యాయం జరగడం లేదంటూ కొందరు హిజ్రాలు కన్నీరు పెట్టుకున్నారు.
మరో వర్గానికి చెందిన యాస్మిన్, మోనాలిసా, స్వప్న అనే హిజ్రాలు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై పలు చోట్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
సామాజిక కార్యకర్త చంద్రముఖి చొరవతో సమస్యను పరిష్కరించేందుకు సైబరాబాద్ పోలీసులు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొందరు హిజ్రాలు గ్రూపులుగా ఏర్పడి తమకు నెల నెల మాముళ్లు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే తమపై దాడులు చేయిస్తున్నారని వాపోయారు. పోలీసులకు పిర్యాదు చేసిన తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని అశిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:Ganesh immersion: గణేశ్ నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరణ