తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్టేషన్​లో హంగామా చేసిన హిజ్రాలను కఠినంగా శిక్షించాలి' - hijra welfare society latest news

సమాజంలో కొందరి విపరీత ప్రవర్తన కారణంగా తాము ఇబ్బందులు ఎదర్కోవాల్సి వస్తోందని హిజ్రా, ట్రాన్స్‌జెండర్‌ వెల్పేర్‌ సొసైటీ తెలిపింది. ఇటీవల హైదరాబాద్​లోని నేరెడ్‌మేట్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో, పోలీసు స్టేషన్‌లో బట్టలు విప్పి హంగామా సృష్టించిన హిజ్రాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

The Hijra Welfare Society demands that those who undress at the police station be punished
పోలీసు స్టేషన్​లో బట్టలు విప్పిన వారిని శిక్షించాలని హిజ్రా వెల్ఫేర్ సొసైటీ డిమాండ్

By

Published : Jun 18, 2021, 9:34 PM IST

హైదరాబాద్‌లోని నేరెడ్‌మేట్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో, పోలీసు స్టేషన్‌లో బట్టలు విప్పి హంగామా చేసిన హిజ్రాలను కఠినంగా శిక్షించాలని హిజ్రా, ట్రాన్స్‌జెండర్‌ వెల్పేర్‌ సొసైటీ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశలో పాల్గొన్న ఆ సంఘం ప్రతినిధులు కొందరి కారణంగా సమాజంలో తాము అవహేళనకు గురికావాల్సివస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నగరంలోని జరుగుతున్న అంశాలతో పాటు హిజ్రాల వ్యక్తిగత విషయాలపై కూడా కొందరు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని హిజ్రా, ట్రాన్స్‌జెండర్‌ వెల్పేర్‌ సొసైటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్రాలకు ఏదైనా సమస్య వస్తే పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప.. ఆ విషయాలపై సోషల్‌ మీడియా వేదికగా చర్చ చేయొద్దని సూచించారు.

ఇదీ చదవండి:ట్రాన్స్​ఫార్మర్​ను ఎక్కిన విద్యుత్​శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details