శశి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశీ సింగ్, మోడల్ అర్చనా రవి నగరంలో సందడి చేశారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ హోటల్‌లో ఏర్పాటు చేసిన హైలైఫ్ జాతీయ స్థాయి వస్త్రాభరణాల ప్రదర్శనను రాశీసింగ్, అర్చనా రవి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తూ ఫొటోలకు పోజులిస్తూ ఆకట్టుకున్నారు.
వస్త్రాభరణాల ప్రదర్శనలో 'శశి' హీరోయిన్ సందడి - highlevel national level costumes exhibition in hicc
మాదాపూర్ హెచ్ఐసీసీలో వర్ధమాన సినీనటి రాశీ సింగ్, పలువురు మోడల్స్ సందడి చేశారు. హోటల్‌లో ఏర్పాటు చేసిన హైలైఫ్ జాతీయ స్థాయి వస్త్రాభరణాల ప్రదర్శనను నటి ప్రారంభించారు.
shashi
మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 400 మంది డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్ ఉత్పత్తులను భాగ్యనగర ఫ్యాషన్ ప్రియులకు పరిచయం చేస్తున్నట్లు హైలైఫ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు. శశి చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని రాశీసింగ్ అన్నారు. ఈ చిత్ర విజయంతో తెలుగులో పెద్ద బ్యానర్లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావించారు.