తెలంగాణ

telangana

ETV Bharat / state

కాచిగూడ ప్రమాదంపై హైలెవల్​ కమిటీ విచారణ - rail accident

కాచిగూడ రైళ్ల ప్రమాద ఘటనపై హైలెవల్​ కమిటీ విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకూ ఈ విచారణ జరుగనుంది. సాంకేతిక లోపమా..? లేక మానవ తప్పిదమా..? అనే విషయాలు ఈ విచారణలో తేలనున్నాయి.

కాచిగూడ రైళ్ల ప్రమాదంపై 10.30 గంటలకు హైలెవల్​ కమిటీ విచారణ

By

Published : Nov 13, 2019, 10:10 AM IST

Updated : Nov 13, 2019, 11:09 AM IST

కాచిగూడ రైళ్ల ప్రమాద ఘటనపై హైలెవల్ కమిటీ విచారణ ప్రారంభమైంది. విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారి రాంకృపాల్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో రాంకృపాల్​తోపాటు మరో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రైల్వే సేప్టీ అధికారి పాల్గొన్నారు. ఈ ఘటన చూసిన వారిని, ఆ సమయంలో విధులు నిర్వహించిన వారిని విచారిస్తారు. కాచిగూడ రైల్వేస్టేషన్​లో విచారణ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ రైల్​భవన్​లో హైలెవల్ కమిటీ మరోసారి రైల్వే ఉద్యోగులను విచారిస్తుంది. రైళ్ల ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా..? లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా..? అనే విషయం విచారణతో వెలుగులోకి రానుంది.

కాచిగూడ రైళ్ల ప్రమాదంపై 10.30 గంటలకు హైలెవల్​ కమిటీ విచారణ
Last Updated : Nov 13, 2019, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details