రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేందుకు నమూనాను రూపొందించినట్లు తెలంగాణ ఉద్యాన శాఖ తెలిపింది. ఆయిల్ ఫామ్‌తోపాటు గట్లపై వెదురు, టేకు, శ్రీగంధం సాగుతో ఈ నమూనా ఉన్నట్లు వెల్లడించింది.
ఆయిల్ ఫామ్ సాగులో అధిక ఆదాయానికి ప్రత్యేక నమూనా
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి పెట్టింది. ఈ మేరకు సాగులో ఎక్కువ ఆదాయం వచ్చేందుకు సంబంధించిన నమూనాను రూపొందించింది. ఫామ్ ఆయిల్ సాగుతోపాటు కంచె వెంబడి వెదురు, టేకు, శ్రీగంధం మొక్కలు పెంచటం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొంది.
ఫామ్ సాగులో ఎక్కువ ఆదాయం కోసం నమునా
దీని ద్వారా ఐదో ఏట నుంచి ఎకరానికి రూ.1.25 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం మీద దీర్ఘకాలంలో నెలవారీగా ఆదాయం ఎక్కువే ఉంటుందని, రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ పంటసాగు వైపు మళ్లాలని పేర్కొంది.
ఇదీ చూడండి :కడంబా అడవుల్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి