సాంకేతిక నైపుణ్యాలకై అవగాహన సదస్సు సాంకేతికత పెరుగుతున్న కొద్దీ విద్యావిధానాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నత విద్యకు, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో మానవ వనరుల సదస్సును హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ హాజరయ్యారు. సాంకేతికతలో కొత్త విప్లవం మొదలైందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు .
సదస్సులో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. రెండురోజుల పాటు దీనిని నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్శిటీల వీసీలు, అక్కినేని అమల తదితరులు పాల్గొన్నారు.