మొత్తం సీట్లపై కాకుండా కేవలం కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లకు 10 శాతం పెంచి.. వాటిని కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తాం’ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి స్పష్టంచేశారు. ఒక ఇంజినీరింగ్ కళాశాలలో 100 సీట్లుంటే.. అందులో కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేసేవి 70 శాతం... అంటే 70 సీట్లు. దానిపై 10 శాతం లెక్కన 7 సీట్లు పెరుగుతాయని ఆయన తెలిపారు.ఇంజినీరింగ్‌లో 7 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 100 శాతం సీట్లను కన్వీనర్ కోటా ద్వారానే భర్తీ చేస్తారు కాబట్టి ఆ మొత్తం సీట్లపై 10 శాతం సీట్లు పెంచుతామన్నారు. గత విద్యా సంవత్సరం(2020-21) సీట్ల ప్రకారం 7,116 సీట్లు పెరుగనున్నాయని చెప్పారు. . ఈ విద్యా సంవత్సరం సీట్లు ఎన్ని అనేది ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని లింబాద్రి చెప్పారు.