ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు కోసం ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఆగస్టు 6 నుంచి 8 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి... ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఆగస్టు 8 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఆగస్టు 8 నుంచి 12 వరకు అభ్యర్థులు కాలేజీ, కోర్సును ఎంచుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 14న సీట్లు కేటాయిస్తామని, సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 14 నుంచి 17 వరకు ఆన్లైన్లో బోధనా రుసుము చెల్లించి... సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని వివరించారు. కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఆగస్టు 3 నుంచి టీఎస్ ఐసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ తెలిపారు.
ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల - ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్-2019
ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు కోసం ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు షెడ్యూలు విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆగస్టు 3 నుంచి టీఎస్ ఐసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
ఐసెట్ కౌన్సెలింగ్