fake certificates issue: నకిలీ సర్టిఫికెట్ల నిర్మూలనకు మాస్టర్‌ప్లాన్ రూపొందించామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. 2010 నుంచి అన్ని వర్సిటీల సర్టిఫికెట్లు పోర్టల్‌లో నమోదు చేశామన్నారు. పోర్టల్‌లో అందరి సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేశామన్న లింబాద్రి.. కంపెనీలు ఉద్యోగుల సర్టిఫికెట్లను పోర్టల్‌లో సరిచూసుకోవచ్చునని తెలిపారు. యూనివర్సిటీల్లో నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపునకు చేపట్టిన చర్యలపై.. ఉన్నత విద్యామండలి అధికారులతో సమీక్షించారు. పోర్టల్ నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
నకిలీ సర్టిఫికెట్లు అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించాం. నకిలీ సర్టిఫికెట్లను గుర్తించేలా ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించాం. ఉన్నత విద్యామండలితో కలిసి వ్యవస్థను సిద్ధం చేశాం. ఈ పోర్టల్ సహాయంతో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వర్సిటీలు జారీ చేసే అన్ని సర్టిఫికెట్లు పోర్టల్‌లో నమోదు చేశాం. దీని ద్వారా ప్రతి సర్టిఫికెట్ అసలుదో, నకిలీదో తెలుస్తుంది. - మహేందర్ రెడ్డి, డీజీపీ