తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana University: తెలంగాణ వర్సిటీలో ఆ నియామకాలన్ని రద్దు - telangana varthalu

తెలంగాణ వర్సిటీలో ఇటీవల చేపట్టిన నియామకాల రద్దుకు ఆదేశం
తెలంగాణ వర్సిటీలో ఇటీవల చేపట్టిన నియామకాల రద్దుకు ఆదేశం

By

Published : Oct 22, 2021, 4:32 PM IST

Updated : Oct 22, 2021, 7:20 PM IST

16:31 October 22

Telangana University: తెలంగాణ వర్సిటీలో ఆ నియామకాలన్ని రద్దు

తెలంగాణ విశ్వవిద్యాలయం ఈసీ సభ్యుల సమావేశం ఈరోజు హైదరాబాద్​లోని రూసా భవన్​లో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నుంచి ఈసీ సభ్యులు, వీసీ రవీందర్ గుప్తా, ఇంఛార్జి రిజిస్టార్ కనకయ్య, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్​లు హాజరయ్యారు. ఇటీవల తెలంగాణ విశ్వవిద్యాలయంలో విలేకరుల సమావేశంలో తాము కుట్రలో భాగమయ్యామని, వర్శిటీ అభివృద్ధికి సహకరించడం లేదని వీసీ రవీందర్ గుప్తా చేసిన వ్యాఖ్యలపై ఈసీ సభ్యులు సమావేశం ప్రారంభంలోనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ నవీన్ మిత్తల్​ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సమావేశం అజెండా కాపీని పది రోజుల ముందు ఇవ్వాల్సి ఉన్నా.. ఒక రోజు ముందు ఇవ్వడం పట్ల ఈసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

వీసీ, రిజిస్ట్రార్​ల తీరుపై నవీన్ మిత్తల్​ అసంతృప్తి

   దీనితో సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసిన నవీన్ మిత్తల్​.. ఈనెల 30న విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని సూచించారు. అలాగే ఈసీ సభ్యులు లేవనెత్తిన అంశాల పట్ల వీసీ రవీందర్ గుప్తాను ప్రశ్నించారు. ఈసీ సభ్యులపై అలాంటి వ్యాఖ్యలు సరైంది కాదన్నారు. ఇటీవల అవుట్ సోర్సింగ్​లో నియమించిన ఉద్యోగాల విషయం తన దృష్టికి వచ్చిందని.. వెంటనే వాటిని రద్దు చేయాలని వీసీని ఆదేశించారు. ప్రొ.కనకయ్య రిజిస్ట్రార్​గా సంతకాలు చేస్తున్నారని.. ఈసీ ఆమోదం పొందే వరకు ఇంఛార్జి రిజిస్ట్రార్​గా మాత్రమే ఉంటారని చెప్పినట్లు తెలిసింది. వీసీ, రిజిస్ట్రార్​ల తీరుపైనా నవీన్ మిత్తల్​ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఔట్​ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీపై వివాదం

     తెలంగాణ వర్శిటీలో ఇటీవల చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ నియామకాలు రద్దయ్యాయి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై ఇటీవల తీవ్ర వివాదం నడుస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నియామకాలపై నిషేధ ఉత్తర్వులను పట్టించుకోకుండా.. వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా నియామకాలు చేపట్టారంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రోస్టర్ విధానం పాటించకుండా, రిజర్వేషన్లను గాలికొదిలి 100 మందికి పైగా సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నారని నిరసన తెలిపారు. వర్శిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు సైతం వీసీ తీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసీ సభ్యులకు సమాచారం లేకుండానే నియామకాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లో తెలంగాణ వర్శిటీ ఈసీ సమావేశం జరిగింది.

ఇదీ చదవండి:Kishan Reddy: 'మేడారం జాతరకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తాం..'

Last Updated : Oct 22, 2021, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details