తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై విచారణ జరపండి: హైకోర్టు - జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి

ప్రముఖ విద్యాసంస్థలైన శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఇంటర్​ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు కాలేజీలు పలు నిబంధనలు ఉల్లంఘించాయని సామాజిక కార్యకర్త రాజేశ్​ దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై విచారణ జరపండి

By

Published : Dec 18, 2019, 5:16 PM IST

Updated : Dec 18, 2019, 6:54 PM IST

శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై విచారణ జరపండి: హైకోర్టు
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు పలు నిబంధనలు ఉల్లంఘించాయన్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఇంటర్​ బోర్డును హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్​ మేడిపల్లికి చెందిన రాజేశ్​ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీచైతన్య 45, నారాయణ విద్యా సంస్థలు 46 ఇంటర్ కాలేజీలు నిర్వహిస్తున్నట్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఒత్తిడి పెంచుతున్నారు..

చాలా కాలేజీల్లో అగ్నిమాపక చర్యలు, క్రీడా మైదానాలు, పార్కింగ్, గ్రంథాలయాలు, లెబొరేటరీ సదుపాయాలు లేవని వ్యాజ్యంలో ఆరోపించారు. అధిక సమయం తరగతులు నిర్వహిస్తున్నారని.. హాస్టళ్లలో ఒక్కో గదిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉంటున్నారని.. పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు. అనేక నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్​లో పేర్కొన్నారు.

స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి ధర్మాసనం.. ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చూడండి: 'విద్యార్థులు క్రీడల్లో రాణించాలి'

Last Updated : Dec 18, 2019, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details