ఇంటర్ ఫలితాలపై విచారణ ఈ నెల 14కు వాయిదా - high court
పిటిషనర్ తరపు న్యాయవాది గడవు కోరిన మేరకు ఇంటర్ ఫలితాల వివాదంపై విచారణను హైకోర్టు ఈనెల 14వ తేదికి వాయిదా వేసింది.
విచారణ వాయిదా
ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంపై విచారణను హైకోర్టు ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. విచారణలో భాగంగా ఇంటర్ బోర్డు న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. అఫిడవిట్‌పై ఇవాళ బాలల హక్కుల సంఘం వాదనలు వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో... వాదనలు వినిపించేందుకు రేపటి వరకు గడవు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణ ఈనెల 14కి వాయిదా వేసింది.