తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈఎస్ఐ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై వివరణ ఇవ్వండి' - ఈఎస్ఐ వేతనాలపై హైకోర్టు

ఈఎస్ఐ పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు చెల్లించక పోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈఎస్ఐలో మందుల కుంభకోణం కారణంగా తమకు 16 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ 19 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

'ఈఎస్ఐ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై వివరణ ఇవ్వండి'
'ఈఎస్ఐ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై వివరణ ఇవ్వండి'

By

Published : Jul 31, 2020, 7:43 PM IST

ఈఎస్ఐ పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు చెల్లించక పోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈఎస్ఐలో మందుల కుంభకోణం కారణంగా తమకు 16 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ 19 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 16 నెలలుగా సిబ్బంది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాస్ వాదించారు.

సూపరింటెండెంట్ అవినీతితో కుంభకోణం జరిగిందని.. దాని వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదన్నారు. వేతనాలు చెల్లించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని కూడా ప్రతివాదిగా చేర్చాలని న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు పిటిషనర్​కు సూచించారు. అదేవిధంగా వేతనాల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వ వివరణ చెప్పాలంటూ విచారణను హైకోర్టు ఆగస్టు 5కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details