తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2020, 4:05 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో సంచార కరోనా పరీక్షలు పెంచాలి: హైకోర్టు

రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

highcourt hearing on corona related petitions
రాష్ట్రంలో సంచార కరోనా పరీక్షలు పెంచాలి: హైకోర్టు

రోజుకు 50 వేలు, వారంలో లక్ష కరోనా పరీక్షలు చేయాలని, రాష్ట్రంలో సంచార కరోనా పరీక్షలు పెంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా తీవ్రతను పరిగణలోకి తీసుకొని సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపింది. కరోనా జాగ్రత్తలకు సంబంధించిన జీవో 64 అమలు బాధ్యత పోలీసులకు అప్పగించాలని కోర్టు సూచించింది. ఆరోపణలు వచ్చిన ప్రైవేటు ఆస్పత్రులపై తీసుకున్న చర్యలు వివరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా మరణాలపై ఆడిట్‌ కమిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని.. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేలా మానసిక హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. డిసెంబరు 15లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ... తదుపరి విచారణను డిసెంబరు 17కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details