కాగజ్‌నగర్‌లో అటవీ అధికారిణి అనితపై దాడి కేసులో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు... కోనేరు కృష్ణకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో 16 మందికి బెయిల్ ఇస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.15 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు... మరో ఇద్దరి పూచీకత్తులను స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని కోనేరు కృష్ణ సహా నిందితులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని... ఫిర్యాదుదారులను బెదిరించవద్దని తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
అటవీ అధికారిణిపై దాడి కేసులో కోనేరు కృష్ణకు బెయిల్ - కోనేరు కృష్ణకు బెయిల్ మంజూరు
అటవీ అధికారిణి అనితపై దాడి కేసులో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు... కోనేరు కృష్ణకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు మరో ఇద్దరి పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సాక్షులను ప్రభావితం చేయవద్దని తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది.
కోనేరు కృష్ణ