తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఇంకెన్ని వాయిదాలు తీసుకుంటారు" - ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్

లోకాయుక్త, ఉపలోకాయుక్త, మానవ హక్కలు కమిషన్​, సమాచార కమిషన్​ సభ్యుల నియామకంపై ఇవాళ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. నోటిఫికేషన్​ జారీ చేశామని, నియామక ప్రక్రియ కొనసాగుతోందని చెబుతూ ఎన్ని వాయిదాలు తీసుకుంటారని న్యాయస్థానం అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్​కు చురకలు అంటించింది.

ఎన్ని వాయిదాలు తీసుకుంటారు: హైకోర్టు

By

Published : Nov 8, 2019, 9:40 PM IST

రాష్ట్రంలో లోకాయుక్త, ఉపలోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, సమాచార కమిషన్​కు సభ్యులను నియమించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాజిక కార్యకర్త కె.వెంకన్న దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని.. నియామక ప్రక్రియ కొనసాగుతోందని చెబుతూ ఎన్ని వాయిదాలు తీసుకుంటారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్​ను ప్రశ్నించింది.

సామాన్యుడికి న్యాయం అందదు..

మానవ హక్కుల కమిషన్, సమాచార కమిషన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త.. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే సంస్థలని హైకోర్టు పేర్కొంది. ప్రజలు నిరంతరం సమస్యలతో అక్కడికి వెళ్తారని గుర్తు చేసింది. ఇలాంటి కీలకమైన కార్యాలయాలు, ప్రాధాన్యత గల స్థానాలను సుదీర్ఘ కాలం ఖాళీగా ఉంచితే ఎలా అని ప్రశ్నించింది. ప్రభుత్వం నియామకాలను చేపట్టకపోవడం వల్ల సామాన్యుడికి న్యాయం అందదని వ్యాఖ్యానించింది. ఈనెల 29కి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అప్పట్లోగా సమాచార కమిషన్, హెచ్ఆర్​సీ, లోకాయుక్త, ఉపలోకాయుక్తలను ప్రభుత్వం నియమిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొంది.

ఇవీ చూడండి: ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులకు అనుమతిపై స్టే

ABOUT THE AUTHOR

...view details