సచివాలయం కూల్చివేతపై ఈ నెల 15వరకు స్టే పొడిగింపు
13:40 July 13
సచివాలయం కూల్చివేతపై విచారణ వాయిదా
సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఈ నెల15వరకు స్టే పొడిగించింది. మంత్రివర్గ తీర్మాన ప్రతి సమర్పించకుంటే విచారణ ఎలా చేపట్టాలని ప్రశ్నించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. సచివాలయం కూల్చివేతపై ప్రభుత్వం జూన్30న తుది నిర్ణయం తీసుకుందని ఏజీ వివరించారు.
అయితే మంత్రివర్గ నిర్ణయంపై కనీసం ప్రెస్‌నోట్ కూడా ఇవ్వలేదని న్యాయస్థానం పేర్కొంది. తీర్మాన ప్రతిని సమర్పించేందుకు ఏజీ గడువు కోరగా... దానిని సీల్డ్కవర్లో సమర్పించాలని ఆదేశించిన కోర్టు... విచారణను వాయిదా వేసింది.