తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై వివరణ ఇవ్వండి'

నూతన అసెంబ్లీ నిర్మాణం, ఎర్రమంజిల్​లో భవనాల కూల్చివేతపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎర్రమంజిల్​లో చారిత్రక భవనాలు కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. విచారణను 8కి వాయిదా వేసింది న్యాయస్థానం.

By

Published : Jul 5, 2019, 5:27 PM IST

Updated : Jul 5, 2019, 6:54 PM IST

HighCourt

'ఎర్రమంజిల్​ భవనాల కూల్చివేతపై వివరణ ఇవ్వండి'

నూతన శాసనసభ నిర్మాణం, ఎర్రమంజిల్​లో భవనాల కూల్చివేత అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్​లో చారిత్రక భవనాలు కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెజస ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సరైన కారణాలు లేకుండానే అసెంబ్లీ భవనాన్ని మరో చోటుకు మార్చాలని నిర్ణయించారని పిటిషనర్ పేర్కొన్నారు.

8కి వాయిదా

ప్రస్తుత భవనం సరిపోవడం లేదని.. అనువుగా లేదనేందుకు ఎలాంటి నివేదికలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కొత్త అసెంబ్లీ కోసం 150 ఏళ్ల నాటి చారిత్రక భవనాలు కూల్చడంతో పాటు... మూడు ఎకరాల అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. కౌంటర్ దాఖలు చేయాలని సర్కారును ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'రైతులకూ సరళమైన వ్యాపారం, సులభతర జీవనం'

Last Updated : Jul 5, 2019, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details