తెలంగాణ

telangana

ETV Bharat / state

High temperatures: రాష్ట్రంలో భానుడి భగభగ.. ఆ జిల్లాల్లో వడగాలులు! - ts news

High temperatures: భానుడు భగభగ మండిపోతున్నాడు. నిప్పులు కక్కుతూ.. వేసవి ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెంచుకుంటూ పోతూ.. జనాల మాడలు పగలగొడుతున్నాడు. రాగల ఐదు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

High temperatures: రాష్ట్రంలో భానుడి భగభగ.. ఆ జిల్లాల్లో వడగాలులు!
High temperatures: రాష్ట్రంలో భానుడి భగభగ.. ఆ జిల్లాల్లో వడగాలులు!

By

Published : Mar 30, 2022, 2:29 PM IST

High temperatures: రాష్ట్రంలో భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రజలు పగలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎర్రటి ఎండలో రెండు నిమిషాలు ఉండలేకపోతున్నారు. మార్చిలోనే మే నెలను తలపిస్తున్న ఎండలను చూసి ఆందోళన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నంపూట బయటకు వస్తున్నారు. రాష్ట్రంలో రాగల 4రోజులలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2నుంచి 4డిగ్రీల సెల్సియస్‌ వరకు కొన్ని చోట్ల పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఏప్రిల్‌ 1, 2 తేదీలలో ఉత్తర వాయవ్య జిల్లాల్లో వడగాలులు వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు. మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు ఉపరితల ద్రోణి ఇంటీరియర్ ఒడిశా నుంచి చత్తీస్‌గఢ్​ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details