High temperatures: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్ల మార్చి నెల ఉష్ణోగ్రతల్లో ఇది కొత్త రికార్డని వాతావరణశాఖ తెలిపింది. గత పదేళ్లలో అత్యధికంగా 2016 మార్చి 18న భద్రాచలంలో 42.8, ఆదిలాబాద్‌లో 2017 మార్చి 31న 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతం మార్చిలోనే వేడి 43 డిగ్రీలకు చేరడంతో ఇక ఏప్రిల్, మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
Weather Forecast: గత పదేళ్ల మార్చి ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డు ఇదే! - Coming Five days high temperatures in telangana
High temperatures: భానుడు భగభగా మండిపోతున్నాడు. నిప్పులు కక్కుతూ.. వేసవి ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెంచుకుంటూ పోతూ.. జనాల మాడలు పగలగొడుతున్నాడు. మంగళవారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ అధికంగా ఉష్ణోగ్రత పెరిగే సూచనలున్నాయని, ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది.
మంగళవారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ అధికంగా ఉష్ణోగ్రత పెరిగే సూచనలున్నాయని, ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. విదర్భ నుంచి కేరళ వరకూ గాలులతో ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతున్నందున ఎండల వేడి పెరిగిందని తెలిపింది. ఎండవేడి కారణంగా నల్గొండ ప్రాంతంలో గాలిలో తేమ సాధారణంకన్నా 24 శాతం తక్కువై పొడి వాతావరణం ఏర్పడింది. ఎండ తీవ్రతతో ఉక్కపోతలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్లలో తక్కువ నీరున్న చోట ఎండుతున్న పంటలకు నీరందించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.
ఇదీ చూడండి:నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ.. స్వయంభువునికి కేసీఆర్ తొలిపూజ..