తెలంగాణలో మందుబాబులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. గొడవ చేయడంలో కాదు మందు తాగడంలో... అవును మీరు విన్నది నిజమే.. తెలంగాణలో ఒక్క అక్టోబరు నెలలోనే రూ.1,650 కోట్ల విలువైన మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. 26.74లక్షల కేసుల లిక్కర్, 38.29లక్షల కేసుల బీరు అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. రోజుకు సగటున రూ.53 కోట్లు విలువైన మద్యం రాష్ట్రంలో అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సెప్టెంబరు నెలాఖరు నాటికే ఎక్సైజ్ లైసెన్స్‌ల గడువు ముగిసినప్పటికీ... కొత్త విధానం అమలుకు కొంత సమయం పట్టడం వల్ల.. నెల రోజులుపాటు పాత లైసెన్స్‌లనే పొడిగించారు.
రంగారెడ్డిలో అత్యధికం