కరోనా సమయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారని, కొందరు యాచకులుగా మారారని బాలల హక్కుల సంఘం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహన్, జస్టిస్ విజయాసేన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఆన్లైన్ తరగతులపై ప్రభుత్వాన్నే అడగాలని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో.. పరిధి దాటి జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా సమయంలో మధ్యాహ్న భోజనం నిలిపివేయడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయని, కేరళ ప్రభుత్వం విద్యార్థులకు టీవీలు, ల్యాప్టాప్ లు సరఫరా చేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో కూడా ఆన్ లైన్ తరగతులు ప్రారంభించేలా ఆదేశించాలని కోరారు.
'తరగతులు, మధ్యాహ్న భోజనంపై సర్కారునే అడగండి' - Hyderabad News
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఆన్లైన్ తరగతులపై ప్రభుత్వాన్నే అడగాలని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో.. పరిధి దాటి జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్ చౌహాన్, జస్టిస్ విజయాసేన్ రెడ్డి ధర్మాసనం తీర్పు చెప్పింది.
పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. పాఠశాలలే మూతపడ్డాయని, మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ, విద్యార్థుల ఇళ్లకు డబ్బు పంపడం వంటివి సాధ్యం కావని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వానికే వినతి పత్రం ఇవ్వాలని సూచించింది. వినతి పత్రం సమర్పించడానికి గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చూడండి:హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్