High Court Stays on Notary Lands Regularization: నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై హైకోర్టు స్టే విధించింది. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర నోటరీ భూముల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 84 అమలు నిలిపి వేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 3 వేల గజాలలోపు నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం జులై 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో 125 గజాల్లోపు నోటరీ స్థలాలకు ఉచితంగా.. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు స్టాంపు డ్యూటీతో క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జీవోలపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
ఈ జీవోను సవాల్ చేస్తూ భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ ఉత్తర్వులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 9కు విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీవో 84 అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
land Regularization : భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విధివిధానాల్లో మార్పులు
జీవో 84ను ఎలా సమర్థించుకుంటారు..? ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15న జరిగిన విచారణ సందర్భంగా జీవో 84ను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలంటూ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరగా.. ఈ విషయంలో ఇది వరకే రెండు వారాల గడువు ఇచ్చినా.. మళ్లీ గడువు కోరడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటరు దాఖలు చేయడానికి చివరి అవకాశంగా వారం గడువు ఇస్తున్నామని.. దాఖలు చేయని పక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ హెచ్చరించింది. ఇలాంటి తీవ్రమైన అంశాల్లో జాప్యం సరికాదని.. వారం గడువు ఇస్తున్నామని తెలిపింది.
స్థలాల క్రమబద్ధీకరణ కోసం భారీగా దరఖాస్తులు
ఇదే సమయంలో.. 125 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభుత్వం 84 జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది డి.నరేంద్ర నాయక్ వాదనలు వినిపించారు. ఈ జీవో కారణంగా నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ సైతం జరిగే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్టాంప్ డ్యూటీని మినహాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. 21న జరిగిన విచారణ సందర్భంగా తీర్పును రిజర్వ్ చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీవో 84 అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
House Plots Regularization: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు
Telangana: వారం రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు: మంత్రివర్గ ఉప సంఘం
'ఇళ్ల పట్టాల కేటాయింపులో పేదలందరికి న్యాయం చేస్తాం'