నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఎనిమిది వారాల పాటు ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని ఈసీని ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల వెంకట నారాయణరెడ్డిని, తెరాస అభ్యర్థి దొడ్ల ఈశ్వర్రెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఈ నెల 4న జరగాల్సిన ఎంపీటీసీ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపి... పూర్తిగా స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది.
గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై హైకోర్టు స్టే - గగ్గల పల్లి ఎంపీటీసీ ఎన్నిక
గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఎనిమిది వారాల పాటు ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఎంపీటీసీ ఎన్నికపై స్టే
గగ్గలపల్లి ఎంపీటీసీ ఎన్నికపై ఎనిమిది వారాలు స్టే
ఇదీ చదవండి : 'ఆ రెండు స్థానాలకు 15 వరకు నోటిఫికేషన్ వద్దు'