తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరి, గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ వాయిదా - గద్వాల

మున్సిపాలిటీల్లో వార్డుల విభజన వివాదంపై హైకోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. భువనగిరి, గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది.

మున్సిపాలిటీ

By

Published : Jul 24, 2019, 7:50 PM IST

భువనగిరి, గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వ్యాజ్యాలపై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసింది. ఇదివరకే నిజామాబాద్ కార్పొరేషన్, కోరుట్ల, మెట్​పల్లి, నిర్మల్, భూపాలపల్లి, ఆర్మూరు, మిర్యాలగూడ తదితర పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ చట్టబద్ధంగా సాగాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ప్రక్రియ కొనసాగిస్తే ఎన్నికలకు వెళ్లవచ్చునని స్వేచ్ఛనిచ్చింది.

ఎన్నికల ప్రక్రియ వాయిదా

ABOUT THE AUTHOR

...view details