తెలంగాణ

telangana

ETV Bharat / state

"డెంగీని నివారించండి... లేకపోతే మృతులకు రూ.50 లక్షలు ఇవ్వండి" - dengue prevention measures

డెంగీ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అధికారులు తీసుకున్న చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయని వ్యాఖ్యానించింది.

'డెంగీ నివారించలేకపోతే మృతుల కుటుంబాలకు 50లక్షలు ఇవ్వాలి'

By

Published : Oct 24, 2019, 12:05 PM IST

డెంగీ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణకు తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. అధికారులు తీసుకున్న చర్యలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొంది. ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని... క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగుంటే ప్రజలు న్యాయస్థానికి ఎందుకు వస్తారని హైకోర్టు ప్రశ్నించింది. డెంగీని నివారించకపోతే మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. విచారణకు ప్రభుత్వం తరపున సీఎస్ ఎస్​కే జోషి హాజరయ్యారు. పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్​కుమార్, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులు విచారణలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details