మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలంలో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందంటూ 2016లో దాఖలైన పిటిషన్... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ విషయంలో కౌంటరు దాఖలు చేసేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి స్పందించకపోతే విచారణ ఎలా జరపాలని ప్రశ్నించింది.
కౌంటరు దాఖలులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది: హైకోర్టు - తెలంగాణ తాజా వార్తలు
పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని... హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి స్పందించకపోతే విచారణ ఎలా జరపాలని ప్రశ్నించింది. ఉప్పల్లోని ప్రభుత్వ భూమి ఆక్రమణలకు సంబంధించిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయనందుకు రెవెన్యూ అధికారులకు రూ.10 వేలు జరిమానా విధించింది.
కౌంటరు దాఖలులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది: హైకోర్టు
ఆక్రమణలు తొలగించి కౌంటర్లు దాఖలు చేయాలని నాలుగున్నరేళ్లయినా ఇంకా సమయం సరిపోలేదా అని ప్రశ్నించింది. ప్రభుత్వ భూమిని కాపాడుకోవాలనే ఆలోచన లేదా అని ఘాటుగా స్పందించింది. నాలుగు వారాల్లో రూ.10 వేలు జరిమానా చెల్లించి, కౌంటరు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేస్తూ విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 'జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో భాజపా పోటీ చేస్తుంది'