కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి
16:21 May 26
కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి
తెలంగాణలో కరోనా పరీక్షలు జరుగుతున్న తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఇకపై మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
‘‘మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారు. కరోనా పరీక్షలపై కేంద్రం రెండుసార్లు రాసిన లేఖలతో పాటు.. మార్చి 11 నుంచి చేసిన పరీక్షల వివరాలను సమర్పించాలి. రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో ఎంతమంది వైద్య సిబ్బందికి ఇచ్చారు. ఈ విషయాలన్నింటిపై జూన్ 4లోగా నివేదిక సమర్పించాలి’’ అని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
TAGGED:
high court serious on govt