శాసన మండలిలో భూపతిరెడ్డి వేటు కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది. భూపతిరెడ్డిపై వేటు రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది. తనపై అనర్హత వేటు వేస్తూ అప్పటి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భూపతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.
భూపతిరెడ్డిపై వేటు రాజ్యాంగబద్ధమే: హైకోర్టు - trs
మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అనర్హత వేటు రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
court
తెరాస ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ గులాబీ నేతలు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. విచారించిన స్వామిగౌడ్ అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.