High court Review on Corona: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది. ఈనెల 12 వరకు ఉన్న కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాసరావు ఉన్నత న్యాయస్థానానికి ఇప్పటికే నివేదిక సమర్పించారు. కొవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని డీహెచ్ పేర్కొన్నారు. ఈనెల 12 నాటికి పాజిటివిటీ రేటు అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 6.95.. జీహెచ్ఎంసీలో 5.65 శాతానికి చేరిందన్నారు.
పాజిటివిటీ రేటు పది శాతానికి చేరితే...
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పాజిటివిటీ రేటు పది శాతానికి చేరితే రాత్రి కర్ఫ్యూ, కార్యాలయాల్లో సిబ్బంది, ప్రజా రవాణా వ్యవస్థ తగ్గింపు వంటి ఆంక్షలు విధించాల్సి ఉంటుందని.. అయితే ఈనెల 12 నాటికి ఒక్క జిల్లాలోనూ అలాంటి పరిస్థితి తలెత్తలేదని డీహెచ్ తెలిపారు. ముందు జాగ్రత్తగా సభలు, సమావేశాలు, ఇతర జన సమూహాలపై ఈనెల 20 వరకు నిషేధం విధించినట్లు డీహెచ్ శ్రీనివాసరావు నివేదికలో తెలిపారు. ఈ ఏడాది తొలి 12 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 18 వేల 196 కేసులు నమోదయ్యాయని.. సరాసరి పాజిటివిటీ రేటు 2.76శాతం ఉందన్నారు.
అందుబాటులో కిట్లు...