తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 14 నుంచి న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణలు.. ఉత్తర్వులు జారీ - high court resume physical hearings

Physical Hearings in courts: న్యాయస్థానాల విధుల నిర్వహణపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఈనెల 14 నుంచి ప్రత్యక్ష విచారణలు జరగనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 14 నుంచి న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణలు.. ఉత్తర్వులు జారీ
ఈ నెల 14 నుంచి న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణలు.. ఉత్తర్వులు జారీ

By

Published : Feb 4, 2022, 6:43 PM IST

Physical Hearings in courts: రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఈనెల 14 నుంచి ప్రత్యక్ష విచారణలు జరగనున్నాయి. కొవిడ్ తీవ్రత కారణంగా గత నెల 17 నుంచి హైకోర్టు సహా అన్ని న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణలు ఆగిపోయాయి. ప్రస్తుత ఆన్​లైన్ విచారణల విధానం ఈనెల 13 వరకు కొనసాగుతుందని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14 నుంచి కేసుల ప్రత్యక్ష విచారణలు నిర్వహించేందుకు జిల్లా జడ్జీలు చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఇచ్చే కొవిడ్ నియంత్రణ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని న్యాయస్థానాలకు హైకోర్టు స్పష్టం చేసింది.

కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో జనవరి 17వ తేదీన ఫిబ్రవరి 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి ఇప్పుడే తగ్గుముఖం పడుతున్నందున ఈ నెల 14 నుంచి ప్రత్యక్ష విచారణలు జరగనున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details