రాష్ట్రంలో ముస్లిం శ్మశాన వాటికలను పరిరక్షించేందుకు నిబంధనలు రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వచ్చిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త మహమ్మద్ ఇలియాస్ ఈ పిటిషన్న్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణమ చేపట్టింది.
'చట్టాలు తయారు చేయమని ప్రభుత్వానికి చెప్పలేం..' - ముస్లిం శ్మశాన వాటికల విషయంపై స్పందించిన హైకోర్టు
చట్టాలు తయారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యత శాసన, పాలన వ్యవస్థదేనని... తాము ఆదేశాలివ్వలేమని పేర్కొంది. ఏ శ్మశానం కబ్జా అయిందో స్పష్టంగా పేర్కొంటూ.. ఆధారాలను సమర్పిస్తే విచారణ చేపట్టగలమని తెలిపింది.
నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఎలా ఆదేశించగలమని.. అధికార పరిధి దాటి వ్యవహరించలేమని పేర్కొంది. చట్టాల కోసం ప్రజలు శాసనవ్యవస్థను కోరాలని.. కోర్టులను కాదని వ్యాఖ్యానించింది. ముస్లిం శ్మశాన వాటికలు కబ్జా అయ్యాయని.. సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఏ శ్మశానం కబ్జా అయిందో స్పష్టంగా పేర్కొంటూ.. ఆధారాలను సమర్పిస్తే విచారణ చేపట్టగలమని హైకోర్టు తెలిపింది. ఆధారాలను సమర్పించేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ కోరడంతో విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.