తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్క్యులర్‌ అమలును నిలిపివేయండి:హైకోర్టు - ఎస్​ఈసీ సర్క్యులర్​ తాజా వార్తలు

high-court-rejects-circular-by-issued-by-state-election-commision
సర్క్యులర్‌ అమలును నిలిపివేయండి:హైకోర్టు

By

Published : Dec 4, 2020, 9:51 AM IST

Updated : Dec 4, 2020, 10:52 AM IST

09:50 December 04

సర్క్యులర్‌ అమలును నిలిపివేయండి:హైకోర్టు

బల్దియా ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు సర్క్యులర్​ అమలును ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. స్టాంపు, టిక్​ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని ఎస్​ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించవచ్చన్న హైకోర్టు.. మెజార్టీ తక్కువగా ఉంటే ఫలితాన్ని నిలిపివేయాలని స్పష్టం చేసింది.  

ఇదీ అసలు సంగతి..

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాల్లో స్వస్తిక్‌ గుర్తు ఉన్న వాటినే కాకుండా సంబంధిత పోలింగ్‌ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్​ఈసీ జారీ చేసిన సర్క్యులర్​ను సవాల్​ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్​పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సర్క్యులర్​ అమలును నిలిపివేసింది.

ఇదీ చూడండి: ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

Last Updated : Dec 4, 2020, 10:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details