తెలంగాణ

telangana

ETV Bharat / state

'న్యాయ సిబ్బందికి కొవిడ్​ టీకాపై ఎలాంటి ఆదేశాలివ్వలేం' - న్యాయ సిబ్బందికి కొవిడ్​ టీకాపై హైకోర్టు పిటిషన్​ కొట్టివేత

కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీలో న్యాయవాదులు, న్యాయ సిబ్బందికి ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఇది కేంద్రం నిర్ణయమని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది.

ts high court, covid vaccine, lawyers
తెలంగాణ హైకోర్టు, కొవిడ్​ వ్యాక్సిన్, న్యాయసిబ్బంది

By

Published : Jan 18, 2021, 8:05 PM IST

కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో న్యాయవాదులు, న్యాయ సిబ్బందికి ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న పిల్​ను హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ రాసిన లేఖపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అభిషేక్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

టీకా ఎవరికి ఇవ్వాలన్న ప్రాధాన్యతలను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు పిటిషన్​పై విచారణ ముగించింది.

ఇదీ చదవండి:త్వరలో రోడ్డు ప్రమాదాల నివారణకు టీ20 యాప్​

ABOUT THE AUTHOR

...view details