ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కోడెల శివప్రసాదరావు మృతి అనుమానాస్పదంగా ఉందని.. గుంటూరుకు చెందిన బొర్రగడ్డ అనిల్ కుమార్ వేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనం ఏముందని పిటిషనర్‌ను ప్రశ్నించింది. దేశంలోని అత్యుత్తమ పోలీసు వ్యవస్థల్లో తెలంగాణ ఒకటని.. దర్యాప్తుపై తమకు అనుమానం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దర్యాప్తు కొనసాగుతుండగా మధ్యలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని.. గతంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని హైకోర్టు తెలిపింది.
కోడెల మృతిపై పిటిషన్లో ప్రజాప్రయోజనం ఏముంది: హైకోర్టు - కోడెల మృతి విచారణపై పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనం ఏముందని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
హైకోర్టు
TAGGED:
telangana highcourt