తెలంగాణ

telangana

ETV Bharat / state

'తితిదే ఆస్తుల అమ్మకం'పై విచారణ 3 వారాలకు వాయిదా

తితిదే ఆస్తుల అమ్మకాల అంశంపై ఏపీ ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఆస్తుల వేలం చట్ట విరుద్ధమన్న న్యాయవాది బాలాజీ.. భవిష్యత్తులో దేవస్థానం ఆస్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

high-court-postponed-the-hearing-of-ttd-assets-sale-case
'తితిదే ఆస్తుల అమ్మకం'పై విచారణ 3 వారాలకు వాయిదా

By

Published : May 28, 2020, 12:46 PM IST

తితిదే ఆస్తుల అమ్మకాల అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తితిదే ఆస్తులను వేలం వేయడం చట్ట విరుద్ధమని న్యాయవాది బాలాజీ వాదించారు. భవిష్యత్తులో దేవస్థానం ఆస్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తితిదే ఆస్తులను అధికార వెబ్​సైట్​లో పెట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details