తెలంగాణ

telangana

ETV Bharat / state

డిగ్రీలో నేరుగా ప్రవేశాలకు హైకోర్టు అనుమతి - permition

'దోస్త్'​ ద్వారా కాకుండా నేరుగా ప్రవేశాలు చేపట్టేందుకు పలు డిగ్రీ కళాశాలలకు ఈ ఏడాది కూడా హైకోర్టు అనుమతించింది. తుది తీర్పుకు లోబడే ప్రవేశాలు ఉండాలని స్పష్టం చేసింది.  న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కాలేజీలను 'దోస్త్'​ లో చేర్చవద్దంటూ ఉన్నత విద్యామండలిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.

హైకోర్టు

By

Published : May 21, 2019, 9:34 AM IST

డిగ్రీలో నేరుగా ప్రవేశాలకు హైకోర్టు అనుమతి

ఈ ఏడాది కూడా డిగ్రీ కళాశాలల్లో నేరుగా ప్రవేశాలకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. దోస్త్​ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా​ అడ్మిషన్​ కల్పించేందుకు పలు కళాశాలకు అవకాశం ఇచ్చింది. తుది తీర్పుకు లోబడే ప్రవేశాలు ఉండాలని... ఆ విషయాన్ని విద్యార్థులకు వివరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దోస్త్ ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికి ఆన్​లైన్ ప్రవేశాలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి ఈ నెల 5న ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని పలు కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. ​గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉండగానే.. ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసిందని ఆరోపించాయి. ఆన్​లైన్ ప్రవేశాలు చట్ట విరుద్ధమని వాదించాయి.

ఇప్పటికే అంగీకరించాయి

ఇప్పటికే సుమారు 1,200 కళాశాలు ఆన్​లైన్ ప్రవేశాలకు అంగీకరించాయని.. కొన్ని కాలేజీలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని ఉన్నత విద్యా మండలి తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం... కోర్టును ఆశ్రయించిన పలు కాలేజీలను దోస్త్​లో చేర్చవద్దంటూ ఉన్నత విద్యామండలిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఇవీ చూడండి: 'దుమ్ముగూడెం ఎత్తు పెంపు సీతారామ ఎత్తిపోతలకోసమే'

ABOUT THE AUTHOR

...view details