పది వేల రూపాయల వరద సాయం పంపిణీ నిలిపివేతపై రేపు పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వరద సాయం నిలిపివేయాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది శరత్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
వరదసాయం నిలిపివేతపై ప్రభుత్వానికి, ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశం - High Court order to the State Election
హైదరాబాద్లో వరద సాయం పంపిణీ నిలిపివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
విపత్తుల సమయంలో సహాయానికి ఎన్నికల కోడ్ వర్తించదని పిటిషనర్ శరత్ వాదించారు. ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చి సాయం కొనసాగించవచ్చునన్న నిబంధనలు చెబుతున్నాయని వాదించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నియామళి అమల్లోకి వచ్చినందున... ప్రభుత్వ నిధులను ప్రజలకు పంపిణీ చేయరాదని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది విద్యాసాగర్ వాదించారు. తదుపరి వాదనల కోసం విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
- ఇదీ చదవండి:తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ