తెలంగాణ

telangana

ETV Bharat / state

High court on Group-1 Age: గరిష్ఠ వయోపరిమితి వినతులను పరిశీలించండి: హైకోర్టు - High court on age

High court on Group-1 Age: గ్రూప్- 1 ఉద్యోగాలకు వయోపరిమితి 49 ఏళ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచించింది.

High court on Group-1 Age
హైకోర్టు

By

Published : May 3, 2022, 10:47 PM IST

High court on Group-1 Age: గ్రూప్-1 పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్ల నుంచి 49కి పెంచాలన్న వినతులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలంటూ ఆరుగురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని తెలిపింది.

టీఎస్​పీఎస్సీకి ఏప్రిల్ 26న దరఖాస్తు సమర్పించినప్పటికీ స్పందించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో 2017 నుంచి నోటిఫికేషన్లు రానందున ఈ ఒక్కసారి గరిష్ఠ వయోపరిమితి పెంచాలని వాదించారు. తమిళనాడులో ఇదే విధంగా వయోపరిమితి పెంచారని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం వినతిపత్రాలపై నిర్ణయం తీసుకుని కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ జూన్ 17కి వాయిదా వేశారు.

ఇవీ చూడండి:తెలంగాణలో జోరుగా 'అక్షయ' అమ్మకాలు

ABOUT THE AUTHOR

...view details