తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారుల అదృశ్యంపై పూర్తి వివరాలు సమర్పించండి: హైకోర్టు - High court Inquiry on disappearance of the children

తెలంగాణలో అదృశ్యమైన చిన్నారుల పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎంత మంది చిన్నారులు అదృశ్యమయ్యారు? ఆచూకీ తెలుసుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

High Court orders to govt
చిన్నారుల అదృశ్యంపై హైకోర్టు విచారణ

By

Published : Apr 15, 2021, 10:01 PM IST

రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చిన్నారుల అదృశ్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో 30 జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

సున్నిత అంశం...

చిన్నారుల అదృశ్యం తీవ్రమైన, సున్నితమైన అంశమని హైకోర్టు పేర్కొంది. చిన్నారుల అదృశ్యంపై ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని తెలిపింది. న్యాయ సేవాధికార సంస్థ, జువైనల్ జస్టిస్ బోర్డులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎంత మంది చిన్నారులు అదృశ్యమయ్యారు? ఆచూకీ తెలుసుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

నివేదిక సమర్పించండి...

ఎంత మందిని తిరిగి కుటుంబాలకు చేర్చారు? సమాజంతో కలిపేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు పేర్కొంది. బాలల అక్రమ రవాణా ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 17లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. న్యాయ సేవాధికార సంస్థ, జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను కూడా ప్రతివాదులుగా చేర్చింది.

ఇదీ చూడండి:ఆన్​లైన్​ రుణయాప్​లపై హైకోర్టుకు డీజీపీ నివేదిక

ABOUT THE AUTHOR

...view details