తెలంగాణ

telangana

ETV Bharat / state

'బిల్డ్‌ ఏపీ' అధికారిపై కేసు నమోదుకు ఏపీ హైకోర్టు ఆదేశం

న్యాయస్థానానికి తప్పుడు అఫిడవిట్​ సమర్పించారంటూ మిషన్​ బిల్డ్​ ఏపీ అధికారిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసునమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

ap high court
'బిల్డ్‌ ఏపీ' అధికారిపై కేసు నమోదుకు ఏపీ హైకోర్టు ఆదేశం

By

Published : Dec 30, 2020, 3:23 PM IST

మిషన్‌ బిల్డ్‌ ఏపీ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కింద కేసు దాఖలుకు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానానికి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ఏపీ హైకోర్టు ‌అసహనం వ్యక్తం చేసింది.

మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ స్థలాలను విక్రయించటాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్లపై జరుగుతున్న విచారణ నుంచి తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం వేసిన రిక్వెజేషన్ పిటిషన్​పై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆంధ్రా సర్కార్​ దాఖలు చేసిన అఫిడవిట్​లో తప్పులున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.

కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించకూడదో తెలపాలంటూ మిషన్ బిల్డ్ ఏపీ అధికారి ప్రవీణ్ కుమార్​కు షోకాజ్​ నోటీసు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రవీణ్ పై కాంపిటెంట్ కోర్టులో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసు నమోదు చేయాలని రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది.

ఇవీచూడండి:మూడు రోజుల్లో 928 డ్రంక్​ అండ్​ డ్రైవ్ కేసులు : సీపీ

ABOUT THE AUTHOR

...view details